Sunday, August 1, 2010

సెల్ ఫోన్ వాడకం గురించి

చాలామంది సెల్ ఫోన్ వాడటం లో సరి అయిన సభ్యత పాటించుట లేదు. పబ్లిక్ లో ఉండేప్పుడు పెద్ద సౌండ్ తో మాట్లాడుతూ ఉంటారు. పక్కన ఉన్నవారికి ఇబ్బంది కలుగుతుందని అస్సలు ఆలోచించరు. అంతే కాదు ఫోన్ రింగ్ సౌండ్ కూడా హెచ్చు గా ఉంచి ప్రజలకు ఇబ్బంది కలుగ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ట్రైన్ లో ప్రయాణించే సమయం లో రాత్రి సమయం లో కూడా పెద్ద గొంతుక తో మాట్లాడుతూ అందరి నిద్ర చెడగోడుతూ ఉంటారు. ఇది చాల దారుణం. ఈ మధ్యన వస్తున్న చైనా సెల్ ఫోన్ లో ఉండే పాటలను పెద్ద సౌండ్ తో పామర జనం వింటూ , పక్క వాళ్ళకు ఇష్టం లేక పోయిన వాళ్ళు పెట్టె చెత్త పాటలు వింటూ ప్రయాణం చేయ వలసి వస్తుంది. దేవుడా వీళ్ళకు ఎప్పుడు జ్ఞానం కలిగిస్తావు?

3 comments:

  1. అజ్ణానం పెంచుకుంటూ పోవటమే నాగరికత కదుటండీ?

    ReplyDelete
  2. “నాగరికత” కాదు, “అజ్ఞానం” కాదు శ్యామలరావు గారూ … ఒళ్లు పొగరు, పక్కవాళ్లంటే లెక్క చెయ్యక పోవడం. కాకపోతే ఏమిటండీ రాత్రి పదకొండు తరువాత కూడా ఐటెం పాటలు, తెల్లవారు ఝామునే భక్తి గీతాలు రైళ్లల్లో అతి సాధారణమైపోయింది. కనీసం ఇయర్ ఫోన్స్ వాడదామనే ఇంగితం కూడా లేని నిర్లక్ష్యం.

    అసలు రైల్లోనూ, బస్సులోనూ దీన్ని నిషేధించమనీ, ఇయర్ ఫోన్స్ లేకుండా వాడద్దనీ, ఈ నిషేధాన్ని అమలు చేసే బాధ్యత కండక్టర్ కు ఇవ్వమనీ - రైల్వే వారికీ, RTC వారికీ గతంలో వ్రాశాను. జవాబే లేదు.

    మరొకటి గమనించారా, మామూలుగా మాట్లాడడానికి కూడా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడడం చాలా చాలా ఎక్కువై పోయింది. సెల్ ని చెవి దగ్గర పెట్టుకోవడం నచ్చడం లేదేమో, లేదా చెయ్యి నొప్పి పుడుతుందనేమో స్పీకర్ లో మాట్లాడేస్తున్నారు. ఎక్కడికి పోతోంది ఈ సమాజం?

    ReplyDelete
  3. వ్రాతపూర్వకంగా ఇతరప్రయాణీకులు ఫిర్యాదు చేసినపక్షంలో బస్సును నడిపే సిబ్బంది ఏప్రయాణీకుడి నైనా మధ్యలోనే దించివేసే అధికారం ఉందనుకోండి. అప్పుడు చచ్చినట్లు జాగ్రత్త పడతారు. ఐతే అలా కఠైనచర్య తీసుకోవటం అంత సులువుకాదు. అవసరం ఆఇతే ఇలా బాధ్యతారహితంగా వ్యవహరించే వారిని పోలీసుష్టేషనులో అప్పగించి వెళ్ళిపోయే అధికారం ఐనా ఉండక తప్పదు. లేకుంటే ఆగడాలు అదుపుచేయటం కష్టం. పైగా ఇటువంటి ఆతతాయిలు ఎదురుతిరిగి ఇతరులపైనా సిబ్బందిపైనా దాడులు చేసే అవకాశం కూడా తప్పకుండా ఉంది.

    ReplyDelete