Monday, September 5, 2011

వినాయక చవితి

         నేడు మనమందరమూ వినాయక చవితి సందర్భముగా చాల చోట్ల వినాయక విగ్రహాలు నిలబెట్టి పండుగను చేసుకుంటున్నాం. కానీ చాలాచోట్ల భక్తి కన్నా ఆడంబరము ఎక్కువ గ కనబడుతుంది.ఎవరో ఒక రాజకీయనాయకుడిని పిలవడం, వారి అనుచరులుతో వారు రావడం వారికీ లేని పోనీ మర్యాదలు చేయడం. ఇదంతా చూస్తుంటే విచిత్రం గా కనిపిస్తుంది. ఎందుకంటే మనం దేవుడిని నిలబెట్టేది భక్తి ప్రపత్తులతో. అంతే తప్ప ఈ సందర్భాన్ని మన ఆధిక్యతను ప్రదర్శించడానికి కాదు.అక్కడి కార్యకర్తలు కూడా ధనవంతులను ఒక రకం గా మిగిలిన వాళ్ళను వేరొక రకం గా చూడడం మంచిది కాదు. అంతేకాదు ఈ నవ రాత్రుల లో పెట్టె ప్రదర్సనలు మరియు లౌడ్ స్పీకర్ల గోల కూడా భరించడం కష్టమే . నిమజ్జనం టైం లో తాగి తందనాలు ఆడడం చూస్తె చాల ఆవేదన కలుగుతుంది.

Sunday, August 14, 2011

స్వాతంత్ర్య దినోత్సవం

రేపే మన స్వాతంత్ర్య దినోత్సవం . ఎన్నో ఏళ్ళు గడుస్తున్నాయి గాని స్వాతంత్ర్యం గురించి మన వాళ్ళకు ఏమి అవగాహన కలగడం లేదు. స్వతంత్రం ఉంది కదా అని ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తే పక్క వాళ్ళ సంగతి ఏంటి ? నేడు ప్రతి చిన్న విషయానికి పెద్ద రాద్ధాంతం చేసుకుంటున్నారు . భావ ప్రకటనా స్వేచ్చ పేరిట పక్క వాళ్ళని కించపరచటం ఏ మాత్రం సంస్కారం కాదు. ఎవరికీ వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకొని తమ స్వార్ధం కొంత తగ్గించుకుని పొరుగువారికి కొంత సాయ పడినట్లయితే నిజమైన స్వాతంత్ర్య ఫలాలను అనుభవించిన వాళ్ళమవుతాం. అంతే కానీ ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాలు ఘనంగా జురుపుకోవడం వలన ఏమీ ఉపయోగం లేదు. మేరా భారత్ మహాన్.

Thursday, August 11, 2011

డబ్బు విలువ

నేడు చాలామంది యువతీ యువకులకు వారి స్వార్ధం తప్ప వేరే ఏది పట్టడం లేదు. ఎంతసేపు వారి వారి పనులు ఐపోతే చాలని, తల్లి తండ్రులు యొక్క ఆర్ధిక పరిస్థితి కూడా చూడకుండా గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. పేరెంట్స్ కూడా అప్పో సొప్పో చేసి వాళ్ళ కు తగిన విధంగా అన్ని సమకూరుస్తున్నారు. ఇది చాల తప్పు. పెద్దవాళ్ళు వారి యొక్క ఆర్ధిక పరిస్థితి పిల్లలకు చిన్న వయసు నుండి తెలేసేట్లుగా చేస్తి డబ్బు విలువ వాళ్ళకు బాగా తెలిసి వారి భవిష్యతు లో కూడా చక్కని ప్లానింగ్ తో ఉంటారు.

Tuesday, March 8, 2011

పెళ్లి పేరు తో అనవసరపు ఖర్చు

ఈ రోజులలో చాలామంది పెళ్లి పేరు తో చాల ఆర్భాటము చేస్తున్నారు. అందులో ముఖ్యముగా విందు లో . ఎన్ని ఎక్కువ ఐటెం లు పెట్టాము అనే తప్ప నిజంగా ఎవరయానా అవి తింటున్నార అని ఎవరు ఆలోచించటం లేదు. కాలుష్యానికి నిలయమైన ఈ రోజుల్లో చాలామంది రక రకాల అనారోగ్యాల బారిన పడి ఎక్కువ గా తెనేందుకు భయపడుతున్నారు . కాని విందులో ఎక్కువ ఐటెం లు పెట్టి చాల డబ్బు వృధా చేస్తున్నారు. దీనివలన ఏ రకమైన ప్రయోజనము లేదు. దానికన్నా ఆ డబ్బు తో సమాజానికి ఉపయోగపడే ఏదైనా కార్యక్రమం చేస్తే ఆ పెళ్లి కి సార్ధకత చేకూరుతుంది. కాబోయే వధూవరులు దీని గురించి ఆలోచన చేయాలి.

Tuesday, August 10, 2010

అనవసరపు చర్చలు

టీవీ చానల్స్ లో వచ్చే చర్చలు చూస్తుంటే చాల బాధగా ఉంటుంది. ఎందుకంటే చానల్స్ లో వారి లో వారికీ ఉన్న కంపిటీషన్ వల్ల అడ్డమైన సబ్జెక్టు ల ఫై లేనిపోని చర్చలు చేయిస్తూ ప్రజల సమయాన్ని వృధా చేస్తున్నారు. చర్చల్లో పాల్గునే వాళ్ళు కూడా తమ తమ ఆధిక్యాన్ని ప్రదర్శించు కుందామనే తప్ప సహేతుకమైన మరియు నిర్మాణాత్మకమైన వివరణలు గాని వాదనలు గాని చెయ్యరు. దానికన్నా చక్కని కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగ పడే విధంగా డిజైన్ చేస్తే ప్రజలందరూ సంతోషిస్తారు. లేదంటే టీవీ ప్రోగ్రంలంటేనే విరక్తి కలిగే రోజు వస్తుంది. మీడియా వాళ్ళు వింటున్నారా.

Sunday, August 1, 2010

సెల్ ఫోన్ వాడకం గురించి

చాలామంది సెల్ ఫోన్ వాడటం లో సరి అయిన సభ్యత పాటించుట లేదు. పబ్లిక్ లో ఉండేప్పుడు పెద్ద సౌండ్ తో మాట్లాడుతూ ఉంటారు. పక్కన ఉన్నవారికి ఇబ్బంది కలుగుతుందని అస్సలు ఆలోచించరు. అంతే కాదు ఫోన్ రింగ్ సౌండ్ కూడా హెచ్చు గా ఉంచి ప్రజలకు ఇబ్బంది కలుగ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ట్రైన్ లో ప్రయాణించే సమయం లో రాత్రి సమయం లో కూడా పెద్ద గొంతుక తో మాట్లాడుతూ అందరి నిద్ర చెడగోడుతూ ఉంటారు. ఇది చాల దారుణం. ఈ మధ్యన వస్తున్న చైనా సెల్ ఫోన్ లో ఉండే పాటలను పెద్ద సౌండ్ తో పామర జనం వింటూ , పక్క వాళ్ళకు ఇష్టం లేక పోయిన వాళ్ళు పెట్టె చెత్త పాటలు వింటూ ప్రయాణం చేయ వలసి వస్తుంది. దేవుడా వీళ్ళకు ఎప్పుడు జ్ఞానం కలిగిస్తావు?

Tuesday, June 29, 2010

ఫ్లేక్స్ బానర్ల gurinchi

రాను రాను ఫ్లేక్స్ బానర్ల వాడకం చాల ఎక్కువగా జరుగుతుంది. ఒక పక్క ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించమని పర్యావరణ నిపుణులు గోల పెడుతుంటే కొత్తగా ఫ్లేక్స్ బానర్ల వాడకం ఎక్కువవుతుంది . ప్రజలు ఇది తప్పనిసరిగా గమనించాలి. ప్లాస్టిక్ సంచుల తో పోలిస్తే ఇది ఇంకా డేంజర్ . ఎందుకంటే ఫ్లేక్స్ బేనర్ల పైన వేసే కెమికల్స్ పర్యావరణానికి చాల హాని చేస్తాయి. ఖర్చు తక్కువగా వుందని చాల మంది ఈ బేనర్ల ను తాయారు చేయిస్తున్నారు . కాని వీటి వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిది . మిత్రులందరూ గమనించాలి